కోరుట్ల

పరిసరాలను పరిశుభ్రం చేసిన యువకులు

viswatelangana.com

September 24th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

మునిసిపల్ కమీషనర్ బట్టు తిరుపతి ఆదేశాల మేరకు స్వచ్చత హి సేవకార్యక్రమంలో భాగంగా ఐలాపూర్ రోడ్ యువత స్వచ్చందంగా ముందుకు వచ్చి మున్సిపల్ కమిషనర్ తో కలిసి పలు ప్రదేశాలను శుభ్రపరచారు. ఈ కార్యక్రమంలో దాదాపు 80 మంది యువకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంను ఉద్దేశించి మున్సిపల్ కమిషనర్ బట్టు తిరుపతి మాట్లాడుతూ… పట్టణంలోని యువకులు మరియు స్వచ్ఛంద సేవ సంఘాలు, స్వచ్చత హి సేవ కార్యక్రమంలో పాల్గొని దీనిని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బట్టు తిరుపతి, ఇంచార్జ్ సానిటరీ ఇన్స్పెక్టర్ అశోక్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ గొనేల మహేష్, అయిలాపూర్ రోడ్ యువత మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

Related Articles

Back to top button