రాయికల్

నిరంతర సామాజిక సేవకులు జర్నలిస్టులు

జర్నలిస్టులకు రూ.10 లక్షల విలువగల ఇన్సూరెన్స్ పాలసీ., ప్రెస్ క్లబ్ (జేఏసీ) అధ్యక్షులు వాసరి రవి

viswatelangana.com

June 20th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :

సమాజంలో ప్రజలకు నిరంతర సామాజిక సేవకులుగా జర్నలిస్టులు పనిచేస్తున్నారని రాయికల్ మండల ప్రెస్ క్లబ్ (జేఏసీ) అధ్యక్షులు వాసరి రవి అన్నారు. స్థానిక ప్రెస్ క్లబ్ కార్యాలయంలో ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో చేపట్టిన వర్కింగ్ జర్నలిస్టులకు వ్యక్తిగత ఇన్సూరెన్స్ పాలసీ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత తరుణంలో జర్నలిస్టులు వృత్తియే దైవంగా సమాజసేవ పరమావధిగా భావించి తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తున్నారని ఆయన అన్నారు. మహమ్మారి కరోనా కల్లోలంలోను, ప్రస్తుతం నవీన సమాజంలోనూ చాలీచాలని వేతనాలతో, నిరంతరం వృత్తి యే దైవంగా భావించి, ప్రమాదాలను సైతం లెక్కచేయకుండా తమ ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వర్తిస్తున్నారని, మన కుటుంబాలకు మనమే రక్షగా ఉండేందుకు ప్రమాద బీమా పాలసీలను తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉన్నదని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన వ్యక్తిగత వర్కింగ్ జర్నలిస్టులకు ప్రమాద బీమా రూ. 10 లక్షలు విలువగల పోస్టల్ పాలసీలను చేయగా, అట్టి పాలసీ కార్డులను స్థానిక సబ్ పోస్ట్ మాస్టర్ బి. రాజు, స్థానిక ప్రెస్ క్లబ్ నాయకుల సమక్షంలో వర్కింగ్ జర్నలిస్టులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ జేఏసీ ప్రధాన కార్యదర్శి కడకుంట్ల జగదీశ్వర్, కోశాధికారి మచ్చ శేఖర్, ఉపాధ్యక్షులు నాగిరెడ్డి రఘుపతి, సాయికుమార్, సంయుక్త కార్యదర్శి గంగాధరి సురేష్, గట్టిపల్లి నరేష్ కుమార్, డాక్ సేవక్ ఉమా మహేష్, పాత్రికేయులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button