పార్లమెంట్ ఎన్నికల వేళ కథలాపూర్ లో కళ తప్పిన బిఆర్ఎస్ పార్టీ
కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్న బిఆర్ఎస్ నాయకులు

viswatelangana.com
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలో బిఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న వేళ కళ తప్పుతోంది. బిఆర్ఎస్ పదవిలో ఉన్నంతకాలం కథలాపూర్ లో ప్రచారానికి వెళ్లినప్పుడు వంద మందికి తక్కువ కాకుండా తిరిగిన వాళ్ళు పార్టీలో ఇప్పుడు అటు నాయకులు ఇటు కార్యకర్తలు లేకపోవడంతో ప్రచారం కుంటుపడినట్టు వినికిడి. ఇంతకాలం గులాబీ జెండా నీడన ఉన్న కొంతమంది నాయకులు అధికార కాంగ్రెస్ పార్టీ లోకి వలస పోవడంతో బిఆర్ఎస్ ప్రచారం 2,3 ఊర్ల మధ్యనే చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇది వరకే కొంతమంది సర్పంచ్ లు, యూత్ లీడర్లు కాంగ్రెస్లో చేరిన విషయం తెల్సిందే. మండలంలోని పెద్ద నాయకులు బుజ్జగింపు ప్రయత్నాలు చేసినప్పటికి వలసలు మాత్రం ఆగడం లేదు. ఇంకా కొంతమంది సీనియర్ నాయకులు బిఆర్ఎస్ పార్టీని వీడాలన్న యోచనలో ఉన్నట్లు స్థానిక నాయకత్వానికి చెప్పినా పట్టించుకునే పరిస్థితిలో లేకపోవడం తో కాంగ్రెస్ లో చేరడానికి నిర్ణయించుకుంటున్నట్లు వినికిడి. ప్రజలతో మమేకమైన నాయకులు పార్టీని వీడడం వల్ల బిఆర్ ఎస్ పార్టీ కి తీరని నష్టమే అంటున్నారు.



