పట్టణంలో అనుమతికి విరుద్ధంగా అనుమతి లేకుండా నిర్మించిన నిర్మాణాలపై ఎన్ఫోర్స్మెంట్ టీమ్ సభ్యులు

viswatelangana.com
కోరుట్ల మున్సిపల్ ఎన్ఫోర్స్మెంట్ టీమ్ లీడర్ & రెవెన్యూ డివిజనల్ అధికారి మరియు మునిసిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు కోరుట్ల పట్టణంలో అనుమతికి విరుద్ధంగా నిర్మించిన మరియు అనుమతి లేకుండా నిర్మించిన నిర్మాణాలపై ఎన్ఫోర్స్మెంట్ టీమ్ సభ్యులచే తొలగించరు ఇందులో భాగంగా శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి దేవాలయం ఉత్తరం దిక్కున నాళాను ఆక్రమించిన నిర్మాణంను, 22వ వార్డ్ లో రోడ్ పై నిర్మించిన ర్యాంప్ ను మరియు సాయి బాబా టెంపుల్ వెనక ఆది రాస్తా లో నిర్మిస్తున్న నిర్మాణాలను తొలగించరు అలాగే హై కోర్ట్ ఆదేశాల మేరకు జవహర్ రోడ్ లో సెట్ బ్యాక్ లేకుండా నిర్మించిన చౌహాన్ లలిత నిర్మాణం పై తగు చర్యలు తీసుకొని తొలగించరు ఈ కార్యక్రమంలో మున్సిపల్ టీ పి ఓ A. ప్రవీణ్ టీ పి ఎస్ రమ్య ఎన్ఫోర్స్ మెంట్ టీమ్ సభ్యులు రెవెన్యూ శాఖ అగ్నిమాపక శాఖ పోలీస్ శాఖ R & B శాఖ అధికారులు మునిసిపల్ సిబ్బంది పాల్గొన్నారు.



