కోరుట్ల

అక్రమ నిర్మాణం కూల్చివేత

viswatelangana.com

October 5th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని సాతిరాంపుర కాలనీలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న భవనాన్ని కోర్టు ఆదేశాల మేరకు ఎన్ఫోర్స్మెంట్ బృందం జేసీబీ సాయంతో మున్సిపల్ సిబ్బంది కూల్చివేశారు. కూల్చివేతను కోరుట్ల తహసీల్దార్ పరిశీలించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ బట్టు తిరుపతి మాట్లా డుతూ.. టీజీ-బి పాస్ ద్వారా అనుమతి పొందిన భవన యజమానులు తప్పనిసరిగా అనుమతించిన ప్లాన్ ప్రకారం నిర్మించు కోవాలన్నారు. మున్సిపల్ అనుమతి ప్రకారం అక్రమంగా నిర్మాణాలు చేపడితే 2019 నూతన మున్సిపల్ చట్టం ప్రకారం టీజీబి పాస్ ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చ రించారు. ఈ కార్య క్రమంలో ఇన్ఫోర్స్మెంట్ బృందం, టౌన్ ప్లానింగ్ అధికారి ప్రవీణ్, ఏఈ పోలీసు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button