రాయికల్

తైబజార్ రద్దు చేయాలని మున్సిపల్ కమిషనర్ కు వినతి

viswatelangana.com

March 12th, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలో రోడ్ల వెంబాడ చిన్నచిన్న వ్యాపారం, కూరగాయలు, పండ్లు వివిధ రకాల వస్తువులను పెట్టుకొని ప్రొద్దున నుండి సాయంత్రం వరకు ఎండనక వాననక దానిపై ఆధారపడి జీవిస్తున్న రైతులు వ్యాపారులు జీవన సాగిస్తున్నారు. తైబజార్ అనేది విరిపై ఇబ్బందుల గురిచేసి డబ్బులు వసూలు చేయడం జరుగుతుంది. జగిత్యాలలో తైబజార్ ను జీవన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తీసేయడం జరిగింది. అదే విధంగా రాయికల్ లో కూడా తైబజార్ రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కమిషనర్ మనోహర్ కు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు మ్యాకల రమేష్, మాజీ సర్పంచ్ ఎద్దండి భూమారెడ్డి, నియోజకవర్గ యూత్ కోఆర్డినేటర్ కొయ్యడి మహిపాల్, హనుమాన్ ఆలయ కమిటీ చైర్మన్ దాసరి గంగాధర్, బత్తిని భూమయ్య, షాకీర్, కడకుంట్ల నరేష్, బత్తిని నాగరాజ్, రాకేష్ నాయక్, బొమ్మ కంటే నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button