రాయికల్

అల్లీపూర్ ఇటిక్యాల లో ఆర్.ఎస్.ఎస్. ఆధ్వర్యంలో ఘనంగా శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది ఉత్సవము

viswatelangana.com

April 8th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
  • నిత్య శాఖల ద్వారా వ్యక్తి నిర్మాణం, జిల్లా గ్రామ వికాస ప్రముఖ్ తోపారపు రవీందర్, ఖండ కార్య వాహ్ వేల్పుల స్వామి యాదవ్

ఇటిక్యాల శాఖల ఆధ్వర్యంలో ఘనంగా శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది ఉత్సవము నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యవక్తలు అల్లీపూర్ లో జిల్లా గ్రామ వికాస ప్రముఖ్ తోపారపు రవీందర్, ఇటిక్యాల లో ఖండ కార్య వాహ్ వేల్పుల స్వామి యాదవ్ లు మాట్లాడుతూ సంఘం వ్యక్తి నిర్మాణమే ధ్యేయంగా పని చేస్తుందని, ఉత్తమమైన దేశభక్తులను తయారు చేస్తుందని, 1925 విజయదశమి రోజున సంఘాన్ని పరమపూజనీయ డాక్టర్ కేశవ రావు బలిరాంపంత్ హెడ్గేవారు ఐదుగురు బాల స్వయం సేవకులతో ప్రారంభించారని, అది నేడు వటవృక్షమై, విశ్వవ్యాప్త అయినదని అన్నారు. ప్రార్థన అనంతరం ఆరు రుచులతో కూడిన ఉగాది పచ్చడిని సేవించారు. ఈ కార్యక్రమంలో ఖండ బౌద్ధిక్ ప్రముఖ్ దొంగ జితేందర్ రెడ్డి, సిరిపురం ఆనంద్, కటుకం లవకుమార్, గొడ్డల్న రాజశేఖర్, మిట్టపెల్లి రాజేందర్, రేపాక రమేష్, తిరుమల సందీప్, రాజు కుమార్, బొమ్మకంటి గణేష్, వినయ్, పవన్, ఆశ్వంత్, శ్రీమాన్, సాత్విక్, శ్రీకర్, అభిరాం తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button