పైడుమడుగు గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల భూమి పూజ కార్యక్రమంలో జువ్వాడి కృష్ణారావు

viswatelangana.com
జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం పైడుమడుగు గ్రామంలో సోమవారం రోజున నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల భూమి పూజ కార్యక్రమంలో లబ్ధిదారుల ఆహ్వానం మేరకు ముఖ్యఅతిథిగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జువ్వాడి కృష్ణారావు పాల్గొన్నారు. ఆయనతోపాటు గ్రామ ఇందిరమ్మ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం జరిగిన భూభారతి అవగాహన కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ, గత టీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి వ్యవస్థ ద్వారా రైతులను ఎలా మోసగించిందో వివరించారు. ఈ మోసాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని, ప్రజలందరికీ న్యాయం చేసే దిశగా రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకువచ్చిందని తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తర్వాత గ్రామంలోని ప్రసిద్ధి చెందిన శుక్రవారం అమ్మవారి ఆలయాన్ని దర్శించిన జువ్వాడి కృష్ణారావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల మండల రెవెన్యూ అధికారి కృష్ణ చైతన్య, కోరుట్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పన్నాల అంజిరెడ్డి, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు మరిపెళ్లి జనార్ధన్, మాజీ ఎంపీటీసీలు ఆశిరెడ్డి రాజేశం, నేమురి భూమయ్య, దొమ్మటి నరేందర్ గౌడ్, నేమిళ్ల రామ్మోహన్, సత్తిరెడ్డి, దొమ్మటి తిరుపతి గౌడ్, దుంపల అశోక్, మేకల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.



