కోరుట్ల
ప్రభుత్వ పాఠశాల సందర్శన…సి ఎం బ్రేక్ ఫాస్ట్ ప్రారంభం
కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు

viswatelangana.com
September 4th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
కోరుట్ల పట్టణంలో గల గడి ప్రాథమిక పాఠశాలను బుధవారం సందర్శించిన కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందిస్తున్న బ్రేక్ ఫాస్ట్ ను కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు ప్రారంభించారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్, ఎస్ఎంసి కమిటీ ఛైర్మెన్ పోతుగంటి మంగ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పెరుమాండ్ల సత్యనారాయణ, కౌన్సిలర్ ఎంబేరి నాగభూషణం, నాయకులు పుప్పాల ప్రభాకర్, సంఘ లింగం, మండల విద్యాధికారి గంగుల నరేశం, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజు, ఉపాధ్యాయులు సురేందర్, ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.



