కథలాపూర్
మధ్యాహ్నం భోజనానికి వంట సామాగ్రి అందజేసిన మూదం మనోజ్ కుమార్ తన జన్మదిన సందర్భంగా

viswatelangana.com
March 7th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలోని సిరికొండ గ్రామానికి చెందిన ముదాం మనోజ్ కుమార్ తన జన్మ దినం సందర్భంగా 11వేల రూపాయల విలువైన వంట సామాగ్రిని మధ్యాహ్న భోజన పథకాన్ని సక్రమంగా అమలు పరచడానికి గ్రామంలో గల జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు గురు వారం రోజున విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు లోకిని శ్రీనివాస్, వనతడపుల రవికుమార్, చంద్ర శేఖర్ రావు, శరత్ బాబు, దేవయ్య, అనిత, శ్రీనివాస్ , రవీనా, రికార్డు అసిస్టెంట్ లక్ష్మి నారాయణ తదతరులు పాల్గొన్నారు. మనోజ్ కుమార్ ను పాఠశాల సిబ్బంది ప్రత్యేకంగా అభినందించారు తెలిపారు



