కటుకం గణేష్ కు జీర్డ్స్ సేవా పురస్కార్ అవార్డు
viswatelangana.com
కోరుట్ల పట్టణానికి చెందిన సామాజికవేత్త రక్తదాన సంధానకర్త కటుకం గణేష్ కు వేములవాడ నియోజకవర్గ బిఆర్ఎస్ నాయకులు చల్మేడ లక్ష్మి నరసింహ రావు చేతుల మీదుగా అవార్డ్ ప్రధానం చేశారు. భీమారం మండలం వెంకట్రావుపేట గ్రామంలోని రేడ్డిస్ ఫంక్షన్ హాల్ లో శనివారం నాడు జీర్డ్స్ స్వచ్ఛంద సంస్థ 17వ వార్షికోత్సవం సందర్భంగా జీర్డ్స్ సేవా పురస్కార్–2024 అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో గత 17 సంవత్సరాల నుండి రక్తదాన ఉద్యమాన్ని నడిపిస్తూ ఇప్పటివరకు 4,250 మందికి రక్తదాతలతో రక్తం అందించి రక్తం అవసరం ఉన్న పేషంట్లకు రక్త దాతలను అందుబాటులో ఉంచుతూ రక్తాన్ని సమకూర్చినందుకు రక్తదాన విభాగంలో విశేష ఉత్తమ సేవలు అందించినందుకు సేవా పురస్కార్ అవార్డు దక్కింది. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు చల్మేడ లక్ష్మి నరసింహ రావుజడ్ పి వైస్ చైర్మన్ హరిచరణ్ రావు అంగడి ఆనంద్ శ్రీపాల్ రెడ్డి శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు.



