రాయికల్
విద్యార్థినిని అభినందించిన ఉపాధ్యాయులు
viswatelangana.com
February 23rd, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని పదవ తరగతి విద్యార్థి దాసరి జలధీజ సమయం వృధా చేస్తే జీవితం వృధా అనే అంశంపై శ్రీ సత్య సాయి ఆర్గనైజేషన్ నిర్వహించిన జిల్లాస్థాయి వ్యాసరచన పోటీ సెప్టెంబర్ 13 2023 రోజున వ్యాసరచన పోటీ పరీక్ష నిర్వహించగా జిల్లా స్థాయిలోద్వితీయ స్థానం మండల స్థాయిలో ప్రథమ స్థానం వచ్చింది మెట్ పెల్లి శ్రీ సత్య సాయి దేవాలయంలో గురువారం రోజున జలధీజ కు ప్రశంసాపత్రం,మెమొంటో అందజేసినట్టు ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి తెలిపారు ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు ప్రతి ఒక్కరూ బాగా చదువుకొని ప్రతి పోటీ పరీక్షల్లో పాల్గొని మంచి ర్యాంకు సాధించి పాఠశాలకు మంచి పేరు తేవాలని అన్నారు జలధీజను ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు గ్రామస్తులు అభినందించారు



