కోరుట్ల
యూ డైస్, అపర్ ల పై ప్రధానోపాధ్యాయుల సమావేశం

viswatelangana.com
March 1st, 2025
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
కోరుట్ల మండల వనరుల కేంద్రంలో మండలంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ప్రాథమిక, ప్రాథమికొన్నత, ఉన్నత, మోడల్ స్కూల్, కస్తూరిబా గాంధీ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు అపర్ అలాగే యూ డైస్ ల పై సమీక్షలు సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో కోరుట్ల మండల విద్యాధికారి గంగుల నరేశం మాట్లాడుతూ మండలంలోని ప్రతి పాఠశాలలొ నమోదు అయిన ప్రతి విద్యార్థి యూ డైస్ ఆన్లైన్ లొ నమోదు చేసుకొని అపార్ నెంబర్ జెనరేట్ కావాలన్నారు. పదవ తరగతి ప్రత్యేక తరగతుల నిర్వహణ ప్రణాళిక ప్రకారం జరగాలని, చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ప్రధానోపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు బి. ఆనందరావు, శ్రీనివాస్, కృష్ణమోహన్, భూమయ్య మండల నోడల్ అధికారి మార్గం రాజేంద్రప్రసాద్, ప్రధానోపాధ్యాయులు, సీఆర్పీలు పాల్గొన్నారు.



