ప్రతి మహిళకు శుభాభివందనాలు

viswatelangana.com
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని విశ్వశాంతి పాఠశాలలో “మహిళా దినోత్సవ” వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. విద్యార్థినిలందరూ వివిధ రకాల వేషధారణలతో చూపరులను ఆకట్టుకున్నారు.పాఠశాల ప్రిన్సిపాల్ మచ్చ గంగాధర్ మాట్లాడుతూ ఓ చారిత్రాత్మక ఉద్యమమే మహిళా దినోత్సవంగా మారిందని, పనిగంటలు తగ్గించమని కోరుతూ మహిళలు చేపట్టిన ఉద్యమం దేశ దేశాల్లో మహిళా దినోత్సవంగా ఉద్భవించింది. నేటి సమాజంలో మహిళలు ఎన్నో అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. మహిళలపై జరుగుతున్న అన్ని రకాల వివక్షలను వదిలి, వారికి మగవారితో సమానంగా అవకాశాలు కల్పించాలని, ఈ ప్రపంచంలో విజయాలు సాధిస్తున్న ప్రతి మహిళకు నా శుభాభినందనలు. వారి త్యాగాలను గుర్తిస్తూ వారి శక్తిని రెండింతలు చేసేలా ప్రతి ఒక్కరూ సహకరించాలి అని అన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు మచ్చ లలిత, విద్యాన్వేష్ ఉపాధ్యాయులు మహేష్ ,రంజిత్ , షారు, రజిత సంజన, ఇందుజ, శృతి, స్రవంతి శ్రీజ, మమత, అపర్ణ ,ప్రత్యూష, మమత ,సహస్ర తదితరులు పాల్గొన్నారు.



