రాయికల్

పత్రికా స్వేచ్చను కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత.

viswatelangana.com

May 3rd, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
  • ప్రెస్ క్లబ్ జేఏసీ అధ్యక్షులు వాసరి రవి
  • ప్రెస్ క్లబ్ జేఏసీ ఆధ్వర్యంలో ఆస్పత్రిలో పండ్లు పంపిణీ.

ప్రజాస్వామ్య వ్యవస్థకు మూల స్తంభంగా, ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా పనిచేస్తున్న పత్రికలను,పత్రికలలో సైనికులుగా పనిచేస్తున్న పాత్రికేయుల హక్కులను కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని మండల ప్రెస్ క్లబ్ జేఏసీ అధ్యక్షులు వాసరి రవి, ప్రధాన కార్యదర్శి కడకుంట్ల జగదీశ్వర్ అన్నారు. ప్రపంచ పత్రిక స్వేచ్ఛ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాయికల్ పట్టణంలోని ప్రభుత్వం వైద్యశాలలో గర్భిణీలకు, బాలింతలకు, అలాగే వైద్యం పొందుతున్న వ్యక్తులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రజల సమస్యలను, ప్రభుత్వాల, అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారం కోసం తన కలంతో అక్షరాన్ని ఎక్కుపెట్టి, నిరంతరం శ్రమిస్తున్న పత్రిక విలేకరుల ఐక్యతకు కలిసికట్టుగా పనిచేయాలని ఆయన అన్నారు. పత్రికా స్వేచ్ఛకు, పాత్రికేయుల హక్కులకు సముచిత స్థానం కల్పించి ఐక్యరాజ్యసమితి ప్రపంచ పత్రిక స్వేచ్ఛ దినోత్సవం గా ప్రకటించడం హర్షించదగ్గ విషయమని, పాత్రికేయుల హక్కులకు భంగం కలిగించే విధంగా ప్రవర్తించే ఎంతటి వారైనా చట్టపరంగా శిక్షార్హులేనని వారు పేర్కొన్నారు. అవినీతి మూలాలను అంతమొందించే విధంగా నిజాలను నిర్భయంగా రాస్తూ ప్రజా సమస్యల పరిష్కారంలో పాత్రికేయులు ముందుండాలని సూచించారు. సమాజం సన్మార్గంలో నడవాలన్న, ప్రభుత్వాల పెత్తనాలు ప్రజలపై తగ్గాలన్న, సమాజంలో అవినీతి అసమానతలు తొలగాలన్న పత్రికకు పాత్రికేయులకు స్వేచ్ఛ కల్పించాల్సిన ఆవశ్యకత అధికార యంత్రాంగంపై ఉన్నదని వారన్నారు. నిత్యం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్న పాత్రికేయ కుటుంబాలను సైతం ప్రభుత్వాలు ఆదుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ జేఏసీ ఉపాధ్యక్షులు చింతకుంట సాయికుమార్, నాగిరెడ్డి రఘుపతి, సంయుక్త కార్యదర్శి గంగాధరీ సురేష్, కార్య వర్గ సభ్యులు ఇమ్మడి విజయ్ కుమార్, చెలిమెల మల్లేశం, వైద్యులు అందే ఉదయ్ కుమార్, సతీష్, ల్యాబ్ టెక్నీషియన్ సంతోష్, మండల ప్రెస్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button