రాయికల్
ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్

viswatelangana.com
August 31st, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని కలెక్టర్ బి.సత్యప్రసాద్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓ.పి.ని చెక్ చేసి హాజరు పట్టిక ను పరిశీలించారు. ఆసుపత్రిలో మౌళిక సదుపాయాలను కల్పించాలని సూచించారు. డెంగ్యూ తో అడ్మిట్ అయిన పేషేంట్లను వారికి అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. డాక్టర్ల పనితీరు ఎలా ఉంది అని అడిగారు. ఆ తర్వాత స్టాక్ రిజిస్టర్ ప్రకారం మందులు నిల్వలు ఉన్నాయా లేదా అని చూసారు. జ్వరాలు ఎక్కువగా ప్రబలుతున్న నేపథ్యంలో వైద్యులందరూ అందుబాటులో ఉండి వైద్యం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ రఘువరన్, ఆర్.ఎం.ఓ రామకృష్ణ, డాక్టర్ శశికాంత్, ఎమ్మార్వో, ఎంపిడిఓ, ఎంపిఓ, తదితరులు పాల్గొన్నారు.



