గంజాయి నిందితుడిని పట్టుకున్న పోలీసులు
160 గ్రాముల గంజాయి, మోటార్ సైకిల్, సెల్ ఫోన్ స్వాధీనం

viswatelangana.com
జగిత్యాల జిల్లా కథలాపూర్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మెట్ పల్లి డిఎస్పి శ్రీ ఉమా మహేశ్వర్ రావు మాట్లాడుతూ మంగళవారం మధ్యాహ్నం సమయంలో కథలపూర్ ఎస్సై జి.నవీన్ కుమార్ కి ఒక నమ్మదగిన సమాచారం ప్రకారం కథలాపూర్ మండలం తాండ్రియాల గ్రామానికి చెందిన కాసారపు వర్ధన్ తండ్రి పేరు సతీష్,వయస్సు :19సం.లు అనునతను గంజాయి కి అలవాటు పడి, అలాగే సులువుగా డబ్బులు సంపాదించాలని దురాలోచనతో తక్కువ ధరకు నిషేధిత గంజాయిని కొనుగోలు చేసి దీని ద్వారా ఎక్కువ ధరకు అమ్ముకుందామని ఆలోచనతో కాసారపు వర్ధన్ గత కొన్ని రోజులుగా తక్కువ ధరకు గంజాయిని కొని దానిని కథలాపూర్ మండలం మరియు దాని పరిసర గ్రామాలలో యువతకు మరియు గంజాయి తాగే అలవాటు ఉన్నవారికి గంజాయిని అమ్ముకుంటూ లాభాలు గడిస్తూ ఉన్నాడు. అదేవిధంగా మంగళవారం వర్ధన్ తన వద్ద గల గంజాయిని కథలాపూర్ మండలంలో యువతకు అమ్ముట కొరకు తన యొక్క మోటార్ సైకిల్ మీద వస్తున్నాడని పక్క సమాచారంతో ఎస్పీ జగిత్యాల ఆదేశాల మేరకు డిఎస్పి ఉమామహేశ్వరరావు మెట్ పల్లి పర్యవేక్షణలో సిఐ సురేష్ బాబు కోరుట్ల ఆధ్వర్యంలో కథలపూర్ ఎస్సై జి.నవీన్ కుమార్ కి మరియు సిబ్బంది కిష్టయ్య, పురుషోత్తం మరియు నవీన్ లు కలిసి పోసానిపేట్ గ్రామ శివారులో నిందితుడు కాసారపు వర్ధన్ తన మోటార్ సైకిల్ పై గంజాయి తరలిస్తుండగా పట్టుకొని అరెస్టు చేయడం జరిగింది. అతడి వద్ద నుండి 160 గ్రాముల గంజాయి, ఒక మోటార్ సైకిల్ మరియు ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఉమా మహేశ్వర్ రావు డి.ఎస్.పి మాట్లాడుతూ కథలాపూర్ మండలం మరియు పరిసర గ్రామ ప్రజలకు యువతకు విన్నపము ఏమనగా యువత ఎవరు కూడా చెడు వ్యసనాలకు ,మత్తు పదార్థాలకు బానిస కాకుండా ఉండాలని, వాటికి అలవాటు పడి భవిష్యత్తు ను నాశనం చేసుకోవద్దని ఎవరైనా గంజాయిని త్రాగిన కొన్న , అమ్మిన చట్టరీత్యా కఠిన తీసుకుంటామని తెలియచేయడం జరిగింది. అదే విధంగా గంజాయి గురించి ఎవరైనా సమాచారం తెలియజేస్తే వారి సమాచారం గోప్యంగా ఉంచుతామని తెలపడం జరిగింది. గంజాయి నిందితుడిని పట్టుకున్న కథలాపూర్ ఎస్సై జి.నవీన్ కుమార్ మరియు సిబ్బందిని మెట్పల్లి డిఎస్పి మరియు ఎస్పీ జగిత్యాల అభినందించారు.



