హైడ్రా చుట్టూ తిరిగాను అక్కడేమో వాటిని కూల్చేస్తున్నారు. మరి ఇక్కడ
కోరుట్ల ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్

viswatelangana.com
గత రెండు నెలలుగా రాష్ట్రంలో కూల్చివేతలు…. ఇక్కడేమో ఇష్ట రాజ్యాంగ కట్టడాలు.. నిన్న, మొన్న రెండు రోజులు హైడ్రా చుట్టూ తిరిగాను అక్కడేమో వాటిని కూల్చేస్తున్నారు. కోరుట్ల నియోజకవర్గంలో పర్మిషన్ లేకుండా కడుతున్నారు.. మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు హయంలో పాత బస్టాండ్ ఏరియా అభివృద్ధి చేస్తే, అక్కడ బస్టాండ్ కడతామని మొదలుపెట్టారు. రైతుబంధు, మహాలక్ష్మి, పెన్షన్ పెంపు విషయాలు అడిగే నాధులే లేరు. కోరుట్ల పట్టణంలో మాజీ మంత్రి రత్నాకర్ రావు విగ్రహం పెట్టడానికి మున్సిపల్ లో మేమందరం ఒప్పుకున్నాం, కల్లూర్ రోడ్డులో మొదలెట్టారు కానీ ప్రజలు అడ్డుకున్నారు. ఇప్పుడేమో వెటర్నరీ కాలేజ్ వద్ద మొదలెట్టారు.. కోరుట్ల మున్సిపల్ కార్మికులకు గత మూడు నెలలుగా జీతం ఇవ్వడం లేదు రోడ్లు అద్వనంగా మారాయి మొన్న కురిసిన వర్షాలకు గుంతలు గుంతలుగా ఏర్పడ్డాయి వాటిని బాగుచేసేందుకు మున్సిపల్ లో నిధులు లేవు కానీ విగ్రహ నిర్మాణానికి నిధులెక్కడి నుండి వచ్చాయని ప్రశ్నించారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితిలో మున్సిపల్ నుండి రత్నాకర్ రావు విగ్రహానికి 21 లక్షలు పెట్టడం చాలా బాధాకరం. అంతేకాకుండా కేవలం కాంగ్రెస్ కౌన్సిలర్లకు సంబంధించిన వార్డులకు మాత్రమే 35 లక్షల రూపాయల ప్రతిపాదనలు పెట్టారు.. రత్నాకర్ రావు విగ్రహం పెట్టడానికి కావాలంటే వారిపై గౌరవంతో నేను నా స్వంత డబ్బులు డొనేట్ చేస్తాను, కానీ మున్సిపల్ డబ్బుల నుండి పెట్టొద్దని కోరుకుంటున్నాను. నియోజకర్గంలో ఎక్కడ చూసిన కాంగ్రెస్ నాయకుల ఆరాచకాలు ఎక్కువయ్యాయి మెట్ పల్లి పాత బస్టాండ్ లో షెడ్ నిర్మాణం బస్టాండ్ నిర్మాణం వెంటనే ఆపేయాలని చెప్తున్నాను.. ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్న వ్యవస్థ అస్సలు పాడు చేయొద్దని కోరుకుంటున్నాను, భవిష్యత్తులో మన పిల్లలకి ఇబ్బంది కలగకుండా చూడాలి… కలెక్టర్ మీరు ఈ విషయంపై వెంటనే స్పందించాలని కోరుతున్నాను, కోరుట్ల మున్సిపల్ చైర్మన్, కమిషనర్ కి మళ్లీ విజ్ఞప్తి చేస్తున్న రత్నాకర్ రావు విగ్రహనికి నిధులు నేనిస్తాను కానీ మున్సిపల్ నిధులు కార్మికుల జీతాలకు అలాగే కోరుట్ల పట్టణ ప్రజల అవసరాలకు వెచ్చించలి అధికారులందరు రూల్స్ పాటించాలని మొన్నటికి మొన్న ఆంధ్రప్రదేశ్ డిజిపి సస్పెండ్ అయిన విషయాన్ని మర్చిపోవద్దన్నారు. రాష్ట్రాన్ని బ్రష్టు పట్టిస్తుంది కాంగ్రెస్ పార్టీ అని పేర్కొన్నారు..



