ఘనంగా పొట్టిశ్రీరాములు జయంతి వేడుకలు

viswatelangana.com
శ్రీ పొట్టి శ్రీరాములు జయంతిని పురస్కరించుకొని వాసవి సీనియర్ సిటిజన్ క్లబ్ కోరుట్ల ఆధ్వర్యంలో గడి బురుజు వద్ద గల శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. అనంతరం స్వీట్ పంపిణి చేశారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు పడిగల శ్రీనివాస్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు బీజం వేస్తూ తెలుగు మాట్లాడేవారందరికీ ప్రత్యేక రాష్ట్రం కావాలని 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి అసువులు బాసిన అమరజీవి పొట్టి శ్రీరాములు ఆని కొనియాడారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు పడిగల శ్రీనివాస్,కార్యదర్శి కొత్త విద్యాసాగర్, కోశాధికారి శక్కరి వెంకటేశ్వర్లు, వైశ్య సంఘం అధ్యక్షులు మోటూరి రాజు, శక్కరి అశోక్, మంచాల భాస్కర్, దొంతుల వరదరాజన్, గుడిసె కోటేశ్వర్, లింగ ఉదయ్ కుమార్, అర్వపెల్లి ప్రసాద్, ముక్క దామోదర్, కొత్త సురేష్, ఎలిమి బుచ్చన్న, బొడ్ల ఆంజనేయులు, మేడి కిషన్, కొత్త గణేష్, ఉప్పులపు భూపతి, ఎల్లంకి రమేష్, ఉప్పుగండ్ల అశోక్, మంచాల మహేష్ తదితరులు పాల్గొన్నారు.



