రాయికల్

ప్రభుత్వ బాలుర వసతి గృహంలో ప్రవేశాలకు ధరఖాస్తుల ఆహ్వానం

viswatelangana.com

June 2nd, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా రాయికల్ షెడ్యూల్ కులాల బాలుర వసతిగృహం లో అర్హులైన బాలుర నుండి అడ్మిషన్ పొందుటకు దరఖాస్తు చేసుకోవాలని వసతి గృహ సంక్షేమ అధికారి రాగుల రాజ్ కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 3వ తరగతి నుంచి 10 వ తరగతి చదువుతున్న బాలురు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని తెలిపారు. వసతి గృహంలో నోటు పుస్తకాలు,స్టడీ మెటీరియల్, బెడ్ షీట్స్, నాలుగు జతల డ్రస్సులు, 10వ తరగతి విద్యార్థులకు ప్రేరణ తరగతులు, ప్రతి విద్యార్థికి నెలకు మూడవ తరగతి నుంచి ఏడవ తరగతి వరకు 150 రూపాయలు మరియు ఎనిమిదవ తరగతి నుంచి పదవ తరగతి వరకు 200 రూపాయలు సబ్బుల బిల్లుల రూపంలో ఉచితంగా అందించబడును అన్నారు. వసతి గృహంలో టీవీ, గీజర్, బంకర్ బెడ్స్ పరుపులు, ప్యూరిఫైడ్ వాటర్ సౌకర్యం కలదని నాణ్యమైన రుచికరమైన భోజన వసతితో పాటు స్కాలర్షిప్ సౌకర్యం కూడా కల్పించబడినది అని తెలిపారు. ఇతర వివరాలకు వసతిగృహం లో నేరుగా లేదా 9849399243 మొబైల్ నెంబర్ లో సంప్రదించాలని కోరారు.

Related Articles

Back to top button