కథలాపూర్

జననేతకు ఘన నివాళి

viswatelangana.com

September 2nd, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :

స్వర్గీయ డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతిని పురస్కరించుకొని కథలాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళి అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కాయితి నాగరాజు మాట్లాడుతూ జనం మెచ్చిన, జననేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి అని ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజే తొలి సంతకం రైతులకు ఉచిత కరెంట్ ఫైల్ పైన చేశారని గుర్తు చేశారు. అలాగే జల యజ్ఞం, రెండు రూపాయలకే కిలో బియ్యం 108 లాంటి ఎమర్జెన్సీ సర్వీసులు, రైతులకు జీవాధారమైన వరద కాలువను రాజశేఖర్ రెడ్డి ప్రారంభించి పూర్తి చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు, మరియు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోను అలాగే ఇప్పుడు మన తెలంగాణలోని ప్రతి ఇంటికి ఉపయోగకరమైన ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టింది కూడా డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి అని గుర్తు చేస్తూ, జనం కోసం రచ్చబండ, పల్లె బాట, కార్యక్రమాలను నిర్వహిస్తూ తను స్వయంగా వెళ్లి ప్రజల సాధక బాధలను తెలుసుకునే కార్యక్రమాన్ని మొదలు పెట్టింది కూడా డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి అన్న విషయాన్ని మరోసారి గుర్తుకు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ కూడా మర్చిపోలేని మహా గొప్ప జననేత ఈ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క నాయకునికి అలాగే కార్యకర్తకు వారు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వెలిచాల సత్యనారాయణ, అజీమ్ పూండ్ర నారాయణరెడ్డి, కల్లెడ గంగాధర్ వర్దినేని లింగారావు, కారపు గంగాధర్,వంగ మహేష్ ఆకుల నారాయణ, పవన్ రెడ్డి, లైసెట్టి గణేష్, నక్క శ్రవణ్, శేఖర్కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button