కొడిమ్యాల
మళ్లీ నిండుకుండలా నిండిన చెక్ డ్యాములు మైసమ్మ చెరువు మత్తడి పై పైపులు ద్వారా
viswatelangana.com
March 23rd, 2025
కొడిమ్యాల (విశ్వతెలంగాణ) :
కొడిమ్యాల మండలలో నిగత ఐదు రోజుల నుండి వాగు కు ఇరువైపుల నున్న పొలాల రైతులు ఆరెపల్లి అప్పారావుపేట పూడూరు రైతులు చందాల రూపంలో డబ్బు జమ చేసుకొని 40 పైపులు కొనుగోలు చేసుకుని కొండాపూర్ మైసమ్మ చెరువు మత్తడి పైనుండి వేసుకోగా ఆదివారం వరకు కొడిమ్యాల పెద్ద వాగు పైన మరియు, పూడూరు వాగుపై నిర్మించిన ఏడు చెక్ డ్యాములు నిండిపొంగిపొర్లుతున్నాయి ఈనీటి మూలంగా దాదాపు 500 ఎకరాలు ఎండిపోనున్నవరి పొలాలకి నీరు అందిరైతులు నష్టపోకుండా కాపాడబడ్డాయి. ఇందుకు స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం నీటి పారుదల శాఖ అధికారులు సహకరించడం జరిగింది రైతులు, రావేప్,విద్యార్థినిలు సంతోషించారు.



