కోరుట్ల
ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం

viswatelangana.com
September 5th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని వాసవి క్లబ్ సీనియర్ సిటిజన్, వాసవి క్లబ్ కోరుట్ల ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని కల్లూరు రోడ్ లోని ప్రభుత్వ పాఠశాలలో ఘనoగా నిర్వహించారు. మాజీ రాష్ట్రపతి, తత్వవేత్త, పండితుడు, భారతరత్న గ్రహీత, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదిన విశిష్టత గురించి విద్యార్థులకు క్లబ్ అధ్యక్షులు నేతి శ్రీకాత్ వివరించారు. అనంతరo ఊపాధ్యాయులను శాలువాతో ఘనముగా సన్మానించారు. ఈ కార్యక్రమములో ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ మనోజ్ కుమార్, జిల్లా ఇంచార్జి నీలి లక్ష్మి, సీనియర్ సిటీజన్ అధ్యక్షులు నీలి శ్రీనివాస్ వాసవి గ్రేటర్ క్లబ్ అధ్యక్షులు నేతి శ్రీకాంత్, సభ్యులు పాల్గొన్నారు.



