కోరుట్ల

కల్లూరు వాగుపై హైలెవెల్ వంతెన నిర్మించాలి మాజీ సర్పంచ్ అంజయ్య

కల్లూరు వాగు వంతెనను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్

viswatelangana.com

August 12th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

కోరుట్ల మండలం కల్లూరు వాగుపై హైలెవెల్ వంతెన నిర్మించాలని కల్లూరు తాజా, మాజీ సర్పంచ్ వనతడుపుల అంజయ్య ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు. గతంలో కురిసిన భారీ వర్షాలకు కల్లూరు వాగుపై నుండి రాకపోకలు నిలిచిపోవడంతో, చుట్టుపక్కల గ్రామాల వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత సంవత్సరంలో కురిసిన భారీ వర్షాలకు లోలెవెల్ వంతెన ఎన్నిసార్లు మరమ్మత్తు చేసినా కూడా కొట్టుకుపోవడంతో అనేక అవస్థలు ఎదుర్కోవాల్సి వచ్చిందని, ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ దృష్టికి తీసుకువెళ్లామని ఎమ్మెల్యే సంజయ్ లోలెవెల్ వంతెనను పరిశీలించారని, అనంతరం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారని అంజయ్య పేర్కొన్నారు. హై లెవెల్ వంతెన నిర్మాణం త్వరగా చేపట్టి నిర్మాణం చేయాలని అంజయ్య ప్రభుత్వానికి, స్థానిక ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేసారు.

Related Articles

Back to top button