ఓటు ప్రాధాన్యత పై అవగాహన ర్యాలీ

viswatelangana.com
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని లిటిల్ జీనియస్ హై స్కూల్ యొక్క ఆధ్వర్యంలో 25 జనవరి 15వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం రోజున స్కూల్ విద్యార్థులు ఓటు యొక్క ప్రాధాన్యత పైన అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు ప్లాకార్డ్స్ పట్టుకొని ఓటు యొక్క ప్రాధాన్యత మరియు ఓటును అమ్ము కోకుండా నిజాయితీగా ఓటు వేసి మంచి నాయకులను ఎన్నుకోవాలని నినాదాలు చేస్తూ స్కూల్ నుండి అంబేడ్కర్ విగ్రహం వరకు ర్యాలీని నిర్వహించారు. అంబేడ్కర్ విగ్రహం వద్ద ఓటర్లను మేల్కొల్పే విధంగా పాటలు పాడుతూ నృత్యం చేస్తూ పట్టణ ప్రజలను చైతన్యపరిచారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు అక్కడున్న ప్రజలచే ఓటర్స్ ప్రతిజ్ఞ చేయించారు. ఇట్టి కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ బండి మహదేవ్, హై స్కూల్ ప్రిన్సిపల్ కలకుంట్ల రాధాకృష్ణ, ప్రైమరీ ప్రిన్సిపల్ కొత్త వినోద్, ప్రీ ప్రైమరీ కటుకం సంధ్యారాణి, డైరెక్టర్ కొత్త రాజు, ఉపాధ్యాయులు సంఘ మహేష్, దేవదాస్, జీవిత మరియు విద్యార్థులు పాల్గొన్నారు.



