కరీంనగర్
బీడీ కార్మికురాలి కొడుకు కు సివిల్స్ లో 27 వ ర్యాంకు

viswatelangana.com
April 17th, 2024
కరీంనగర్ (విశ్వతెలంగాణ) :
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామానికి చెందిన నందల సాయికిరణ్ సివిల్స్ లో 27వ ర్యాంకు సాధించాడు.ఇతని తండ్రి నందల కాంతారావు చేనేత కార్మికుడు అనారోగ్యంతో 2016లోనే చనిపోయాడు.దీంతో తల్లి లక్ష్మి బీడీ కార్మికురాలిగా పని చేస్తూ బిడ్డ స్రవంతి, కొడుకు సాయికిరణ్ ను కష్టపడి చదివించింది. వరంగల్ ఎన్ఐటీలో ఇంజనీరింగ్ పూర్తిచేసిన సాయికిరణ్ ప్రస్తుతం సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం చేస్తూనే సివిల్స్ కు ప్రిపేరయ్యారు. ఎలాంటి కోచింగ్ లేకుండా రెండో అటెంప్ట్ లోనే 27వ ర్యాంకు సాధించారు.



