రాయికల్
దివంగత మాజీ జర్నలిస్ట్ దాసరి రవీందర్ జయంతి వేడుకలు

viswatelangana.com
March 20th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణానికి చెందిన దివంగత మాజీ సీనియర్ జర్నలిస్ట్ దాసరి రవీందర్ జయంతి సందర్భంగా రాయికల్ పట్టణంలోని పోలీస్ స్టేషన్కు ఎదురుగా గల అతని విగ్రహానికి పూలమాలలు వేసి, కేక్ కట్ చేసి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించిన కుటుంబ సభ్యులు.ఈ కార్యక్రమంలో రాయికల్ మున్సిపల్ చైర్మన్ మోర హన్మండ్లు, కుటుంబ సభ్యులు రవి ప్రసాద్, డా. సుజిత్, భోగ రాము,కౌన్సిలర్ లు శ్రీధర్ రెడ్డి, మహేష్, ప్రెస్ జేఏసీ ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్, సంయుక్త కార్యదర్శి సురేష్, ప్రెస్ జేఏసీ సభ్యులు సయ్యద్ రసూల్, గోపాల్ రెడ్డి, శ్రీకర్,తదితరులు పాల్గొని ఘనంగా నివాళులర్పించారు.



