రుద్రంగి

బైక్ ను డీ కొట్టిన ఆర్టీసీ బస్సు :ఒకరు మృతి

viswatelangana.com

June 14th, 2024
రుద్రంగి (విశ్వతెలంగాణ) :

రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని ఇండియన్ పెట్రోల్ పంపు సమీపంలోని మూల మలుపు వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరికరికి గాయాల య్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కలికోట వైపు నుండి రుద్రంగి వస్తున్న ద్విచక్రవాహనం వేముల వాడ వైపు నుండి కోరుట్ల వెళ్తున్నా ఆర్టీసీ బైకును ఢీకొట్టగా బైక్, పైన ప్రయాణిస్తున్న గండి అజయ్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో యువకుడు బోయిని అభిలాశ్ కు బలమైన గాయాలు కాగా, అట్టి యువకుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రి కు తరలించారు. సంఘటన స్థలాన్ని చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు సందర్శించి, ప్రమాదంపై విచారణ జరపాలని రుద్రంగి ఎస్ఐ అశోక్ ను ఆదేశించారు.

Back to top button