కథలాపూర్
బొమ్మేన గ్రామంలో బడి బాట కార్యక్రమం

viswatelangana.com
May 8th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
కథలాపూర్ మండలం బొమ్మెన గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు బడి బాట కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు, నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్య అందుతున్న తీరు, పాఠశాలలో నిర్వహిస్తున్న వివిధ వినూత్న కార్యక్రమాల గురించి డిజిటల్ విద్య బోధన స్మార్ట్ టివిలో ఉచిత బుక్స్ దుస్తువులు అందిస్తూ తల్లిదండ్రులకు వివరించడం జరిగింది. నాణ్యమైన విద్య అందించుటకు బాధ్యత మాది అని ఉపాధ్యాయులు హామీ ఇవ్వడంతో 14 మంది విద్యార్థులను తల్లిదండ్రులు ఈ రోజు చేర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు అంబటి రవి, ఉపాధ్యాయులు సాయిరెడ్డి, రమేష్, రాజేశ్వరి, విద్యార్థులు పాల్గొన్నారు.



