రాయికల్

బోర్నపెల్లి గోదావరి ప్రాంతాన్ని పరిశీలించిన అడిషనల్ కలెక్టర్

viswatelangana.com

September 2nd, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా రాయికల్ మండలం బోర్నపెల్లి గ్రామంలో స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ బి గౌతమ్ రెడ్డి, గోదావరి పరివాహక ప్రాంతన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, భారీ వర్షాలకు శ్రీరాంసాగర్, కడెం ప్రాజెక్టులకు భారీ వరద నీరు వస్తున్న నేపథ్యంలో గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు వదులుతున్నందున గోదావరి పరివాహక గ్రామస్తులు, గొర్రెల కాపర్లు, రైతులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. లోయగూడెం, కుర్రు ప్రాంతంలో నివసిస్తున్న కుటుంబాల పరిస్థితిని గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. లో లెవెల్ వంతెనలు, చెరువులు, కూలిన ఇండ్లు, తెగిన రోడ్ల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. మండల స్థాయి అధికారులు ఎప్పటికప్పుడు గోదావరి పరివాహక ప్రాంతాన్ని పర్యవేక్షించాలని సూచించారు. ఆయన వెంట తహశీల్దార్ అబ్దుల్ ఖయ్యూం, ఎంపీడీవో బింగి చిరంజీవి, ఇరిగేషన్ డిఈఈ భాస్కర్, ఆర్ఐ పద్మయ్య, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button