ప్రగతిలో ఘనంగా ఆశాంకుర కల్చరల్ డే వేడుకలు

viswatelangana.com
రాయికల్ పట్టణ కేంద్రంలోని ఆర్.ఆర్ కన్వెన్షన్ హాల్లో ప్రగతి ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో ఆశాంకుర -2024 కల్చరల్ డే వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. 2023- 24 విద్యా సంవత్సరంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మెమొంటో బహుకరించారు. అనంతరం యూకేజీ విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డే వేడుకలను ఘనంగా ఏర్పాటు చేసి, మెడల్ తో పాటు సర్టిఫికెట్ అందజేశారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో పప్పెట్ డాన్స్, స్త్రీలపై జరుగుతున్న అకృత్యాలను ఎలా ఎదుర్కోవాలో తెలిపే నృత్యం, కాంచన నృత్యం, తండ్రి కూతుర్ల ప్రేమను తెలిపే పాటలు, జానపద నృత్యాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బాలె శేఖర్ మాట్లాడుతూ, తల్లిదండ్రులకు పాఠశాల పై ఉన్న నమ్మకమే ఆశాంకుర అని, విద్యార్థులలో దాగి ఉన్న నృత్య కళలను వెలికి తీయడం కోసమే ఆశాంకుర కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని అన్నారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయ బృందాన్ని శాలువా, మెమొంటోతో యాజమాన్యం సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ బాలె జయశ్రీ, అకాడమిక్ డైరెక్టర్ నిఖిల్ కుమార్, ఉపాధ్యాయ బృందం, తల్లిదండ్రులు, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.



