కొడిమ్యాల

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఎంపికైన కొడిమ్యాల విద్యార్థిని అశ్విని

viswatelangana.com

April 8th, 2025
కొడిమ్యాల (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల విద్యార్థిని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) నిర్వహిస్తున్న యువిక -2025,యంగ్ సైంటిస్ట్ కార్యక్రమానికి కొడిమ్యాల ఆదర్శ పాఠశాల చెందిన 9 వ తరగతి చదువుతున్న విద్యార్థిని కొలకాని అశ్విని, ఎంపికైంది.దేశవ్యాప్తంగా ఇస్రోకు చెందిన ఎనిమిది పరిశోధన కేంద్రాలలో మే నెలలో పన్నెండు రోజుల పాటు అంతరిక్ష విజ్ఞానానికి సంబంధించిన శిక్షణ ఇవ్వనున్నారు. అశ్విని హైదరాబాద్ లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ లో జరిగే శిక్షణకు ఎంపికైంది. తెలంగాణ రాష్ట్రం నుండి ఎంపికైన పన్నెండు మంది విద్యార్థులలో అశ్విని ఒకరు. వివిధ రకాల అంశాలు, ఆన్లైన్ పోటీ చదువులో చూపిన ప్రతిభ ఆధారంగా అశ్విని ఈ కార్యక్రమానికి ఎంపికైంది.అశ్విని ఇస్రో యువిక కార్యక్రమానికి ఎంపిక కావడం పట్ల పాఠశాల ప్రిన్సిపల్ బి. లావణ్య సంతోషంవ్యక్తం చేసారు.ఆదర్శ పాఠశాల విద్యార్థులను అన్ని రంగాలలో ప్రోత్సహిస్తున్నట్లు తెలియజేసారు. అశ్వినిని, పాఠశాల ప్రిన్సిపల్ తో పాటు ఉపాధ్యాయులు ప్రణిత, పద్మప్రియ,తబస్సుమ్ భాగ్యలక్ష్మి,శరణ్య, శిరీష, విజయ్ కుమార్,రాజేశం, శ్రీధర్,సత్యానందం అభినందించారు.

Related Articles

Back to top button