కథలాపూర్
భూషణరావుపేట లో గద్దర్ విగ్రహం ఏర్పాటుకు భూమిపూజ
viswatelangana.com
February 12th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
ప్రజలను చైతన్యం చేయడంలో గద్దర్ పాటలు కీలక పాత్ర పోషించాయని సామాజిక తెలంగాణ ధూం ధాం రాష్ట్ర అధ్యక్షుడు మారంపెల్లి రవీందర్ అన్నారు. జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలోని భూషణరావుపేట గ్రామంలో గద్దర్ విగ్రహం ఏర్పాటుకు సోమవారం భూమిపూజ చేశారు. కళాకారులు, ప్రజాసం ఘాల నాయకులు పాటలు పాడుతూ ర్యాలీ నిర్వహించారు. గద్దర్ చిత్రప టానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమం లో గద్దర్ జయంతి ఉత్సవాల రాష్ట్ర కో-ఆర్డినేటర్ అంతడుపుల నాగరాజు, బూసిపాక గణేశ్, యాగండ్ల రమేశ్ గౌడ్, కాశవత్తుల లక్ష్మీ రాజం, మారంపెల్లి వినోద్, శనిగారపు గణేష్, ఎంపీటీసి కొండ ఆంజనేయులు, చెదలు సత్యనారాయణ, మైస శ్రీధర్, కూన శ్రీనివాస్, రాజ్ కుమార్, రాములు, రాజం, రమేష్, మైస ప్రదీప్, సంజీవ్, పాల్గొన్నారు.



