రాయికల్
మండల టాపర్ విద్యార్థికి సత్కారం

viswatelangana.com
May 2nd, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం భూపతిపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని బొడ్డుపల్లి రక్షిత 568/600 మార్కులతో ప్రభుత్వ పాఠశాలల్లో మండల టాపర్ సాధించిన సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు ఉమ్మెంతల వెంకటరమణి సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ జక్కుల చంద్రశేఖర్, ఉపాధ్యాయులు బొల్లె చిన్నయ్య విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులకు ఆన్లైన్ మెమో లు అందించారు.



