కోరుట్ల

ఐసిటిసి ఆధ్వర్యంలో హెచ్ఐవి పై విద్యార్థులకు అవగాహన సదస్సు

viswatelangana.com

September 9th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

గ్రామస్థాయి నుండి మండల, జిల్లా, రాష్ట్రం లోని ప్రతి ఒక్క పౌరులు ఎయిడ్స్ పట్ల పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని, కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రి లోని ఐ.సి.టి.సి కౌన్సిలర్ మల్లికార్జున్ అన్నారు. సోమవారం తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి ఆదేశాల మేరకు పట్టణంలోని అరుణోదయ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు హెచ్ఐవి, ఎయిడ్స్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. హెచ్ఐవి / ఎయిడ్స్ పై అపోహలు తొలగిపోవాలని, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పట్ల వివక్ష చూపకూడదని వివరించారు. ఎయిడ్స్ పై రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత ప్రచారంలో భాగంగానే పోస్టర్ల ద్వారా గ్రామ స్థాయి నుండి రాష్ట్ర నలుమూల వరకు ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ఈ సందర్భంగా ఐ.సి.టి.సి కౌన్సిలర్ మల్లికార్జున్ మాట్లాడుతూ…. హెచ్ఐవి, ఎయిడ్స్ పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని అన్నారు. అవగాహన, జాగ్రత్తలతోనే హెచ్ఐవి నివారించవచ్చునని అన్నారు. ప్రతి ఒక్కరు ముందు జాగ్రత్త కోసం ఎయిడ్స్ పరీక్ష నిర్వహించుకోవాలన్నారు. ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా ఎయిడ్స్ పరీక్ష నిర్వహించినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ పోతని నవీన్, అధ్యాపకులు బట్టు హరికృష్ణ, ల్యాబ్ టెక్నీషియన్ ఎండి. సాజీద్ అలీ, ఎస్.ఎస్.కే మేనేజర్ సంతోష్, సిబ్బంది నాగరాజు, రమ్య,విద్యార్థినీ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button