రాయికల్
మహిళ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణ అభియాన్

viswatelangana.com
March 14th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
మహిళ అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణ అభియాన్, పోషణ పక్షోత్సవాల కార్యక్రమంలో భాగంగా రాయికల్ మండలంలోని ఇటిక్యాల ఐదవ అంగన్వాడీ కేంద్రం మరియు ఇటిక్యాల న్యూ అంగన్వాడి కేంద్రం లో గర్భిణీలకు బాలింతలకు మరియు సున్నా నుండి ఐదు సంవత్సరాల పిల్లల తల్లులకు పాలు పరిశుభ్రమైన ఆహార అలవాట్లు, పోషక విలువలు కలిగిన ఆహారపార్థాలపై అవగాహన కల్పించారు. మరియు పోషకాహారం ప్రతిజ్ఞ చేయించడం జరిగింది.. ఈ కార్యక్రమంలో అంగన్వాడి కార్యకర్తలు ఈ సుజాత, ఎద్దండి అనురాధ, మరియు ఆశ కార్యకర్త సుమలత మరియు తల్లులు, పిల్లలు ఇతరులు పాల్గొన్నారు



