మేడిపల్లి
కేంద్ర హోం శాఖ మంత్రిని కలిసిన మేడిపల్లి మండల బిజెపి నాయకులు

viswatelangana.com
June 14th, 2024
మేడిపల్లి (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా మేడిపల్లి మండల కేంద్రంలోని బిజెపి నాయకులు శుక్రవారం రోజున న్యూఢిల్లీలో కేంద్ర హోం శాఖ సహాయం మంత్రి బండి సంజయ్ కుమార్ ని మర్యాదపూర్వకంగా కలిసి మెమొంటో, కొండగట్టు అంజన్న స్వామి ప్రసాదం అందించి బండి సంజయ్ కి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎన్ రెడ్డి, మేనేని తిరుమల్ రావు, అన్నాడి జలపతి రెడ్డి, కొప్పెర లింగారెడ్డి, మామిడి ధర్మారెడ్డి, కొండాపూర్ గ్రామ ఎంపిటిసి మేకల రాజు తదితరులు పాల్గొన్నారు.



