కథలాపూర్
రాష్ట్ర మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల సమైక్య చైర్మన్ గా మెట్టు సాయికుమార్ నియామకం
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ని సన్మానించిన జిల్లా గంగ పుత్ర సంఘం

viswatelangana.com
March 20th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
రాష్ట్ర మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల సమైక్య చైర్మన్ మెట్టు సాయికుమార్ ని నియమించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి వేములవాడ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కి ధన్యవాదములు తెలుపుతూ జగిత్యాల జిల్లా ఫిషర్ మెన్ కాంగ్రెస్ అధ్యక్షులు తోపార రజనీకాంత్ మరియు ఫిషర్మెన్ రాష్ట్ర కార్యదర్శి కల్లెడ గంగాధర్,ధర్మపురి నియోజకవర్గ వెల్గటూర్ మండల అధ్యక్షులు గుమ్ముల వెంకటేష్ జగిత్యాల నియోజకవర్గ ఫిషర్ మెన్ కాంగ్రెస్ కార్యదర్శి గుమ్ముల రాజేష్ లు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కి జిల్లా గంగపుత్ర సంఘం తరపున శాలువాతో సన్మానం చేయడం జరిగింది.



