మిత్రబృందం ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందజేత

viswatelangana.com
జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం లోని గోవిందారం గ్రామంలో ఒక పేదింటి ఆడబిడ్డ మొగిల్ల ప్రియాంక తండ్రి ఉపాధి నిమిత్తం సౌదీ వెళ్లారు. ఆకస్మాత్తుగా సౌదీలో మరణించారు మృతదేహాన్ని తీసుకురాలేని దయనీయ పరిస్థితిలో సౌదీలోనే కననం చేసారు. మొగిల్ల ప్రియాంక తల్లి క్యాన్సర్ పేషంట్, ఒక పేదింటి ఆడబిడ్డ పెళ్లి అని మీవంతు ఏమైనా సహాయం చేయమని అడగగానే పెద్దమనసు చేసుకొని ముందుకు వచ్చి పోతుగంటి శ్రీనివాస్ గౌడ్ మిత్రబృందం ఆర్థిక సహకారంతో పెళ్లికూతురు మొగిల్ల ప్రియాంక తల్లికి బీరువా, పరుపులు, 2 కుర్చీలు, ఒక డ్రెస్సింగ్ టేబుల్ మదర్ లవ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా పెళ్లికూతురు ప్రియాంక తల్లి చాలా సంతోషం వ్యక్తం చేస్తూ, ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు. పోతుగంటి శ్రీనివాస్ గౌడ్ వారి మిత్రబృందానికి మదర్ లవ్ చారిటబుల్ ట్రస్ట్ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు..



