మిషన్ భగీరథ నీళ్లు రావడం చూసి ఆందోళన చెండుతున్న గ్రామ ప్రజలు

viswatelangana.com
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం ఊట్పల్లి గ్రామంలో మిషన్ భగీరథ నీళ్లు చాలా రోజుల నుండి రాకపోవడంతో గమనించని ప్రజలు ఈ మధ్యలో రావడంతో గ్రామ ప్రజలు చూసి బిత్తర పోయారు వివరాల్లోకి వెళితే ఊట్ పల్లి గ్రామంలో ఇంతవరకు భగీరథ నీళ్లు రాకపోవడంతో ఏర్పడని సమస్య గత కొన్ని రోజుల నుండి రావడంతో గమనించారు. ఇటీవల కాలంలో కొత్తగా వేసిన కరెంటు పోల్ సమయంలో భగీరథ పైప్ గమనించకుండా కరెంట్ పోల్ వేయడంతో ఆ పైపుకు డ్యామేజ్ జరిగి వాటర్ అందులోనుండి బయటకు పొంగుతూ రావడం జరిగింది దీనివల్ల స్థంభం దగ్గర నీళ్లు చేరి ఆ స్థంబాన్ని ముట్టుకున్న వారు కరెంట్ షాక్ కి గురయ్యే ప్రమాదం ఉన్నది. పాఠశాల కు వెళ్లే దారిలో ఉన్నందున చిన్న పిల్లలు ప్రమాదానికి గురయ్యే ఆస్కారం ఉన్నది. అంతేకాకుండా గ్రామపంచాయతీ ముందర అంతేకాకుండా చాలా చోట్ల లీకేజీలు ఉన్నా గాని పట్టించుకోని జిపి అధికారులు. ఇకనైనా అధికారులు స్పందించి సమస్య ను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.



