మెట్ పల్లి
ఆపదలో ఉన్న మిత్రునికి ఆర్థిక సహాయం

viswatelangana.com
October 30th, 2024
మెట్ పల్లి (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం రంగారావుపేట గ్రామం బొంబాయి సాయన్న భూలక్ష్మి గత ఆరు నెలల క్రితం కిందపడి వెన్నుకు దెబ్బ తాకడంతో మంచానికి పరిమితమై ఉన్నాడని తెలుసుకున్న మిత్ర బృందం తొందరగా కోలుకోవాలని తగిన ఆర్థిక సాయం చేశారు. వారు మాట్లాడుతూ బొంబాయి సాయన్న కుటుంబం రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితిలో ఉన్నాదని, పూర్తిగా మంచానికి పరిమితమై కుటుంబ పోషణ భారంగా మారిన పరిస్థితిలో స్థానిక కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, ఎంపీ ధర్మపురి అర్వింద్ మరియు ప్రభుత్వం, దాతలు ఆదుకోవాలని ఆర్థిక సహాయం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మిత్రులు సేవా రమేష్, ఊటుపల్లి టాటా ఏసీ డ్రైవర్ గంగాధర్ కోనాపూర్ రాజు స్వామి రామ లచ్చక్క పేట నర్సింలు బొంబాయి సాయన్నలు పాల్గొన్నారు.



