రాయికల్

మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించిన తహశీల్దార్

viswatelangana.com

December 7th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని ఇటిక్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ల మధ్యాహ్న భోజనాన్ని రాయికల్ తహశీల్దార్ యం.ఎ. ఖయూమ్ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజన రికార్డులను, బియ్యం నిల్వ ఉంచిన రూంకును పరిశీలించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న మధ్యాహ్న భోజన పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని అన్నారు. మధ్యాహ్న భోజన అమలు పై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పిల్లలతో కలిసి మధ్యాహ్న భోజనాన్ని రుచిచూసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు సీమలదారి సదాశివ్, టి.వై.ఎం.ఎస్.యు రాష్ట్ర శాఖ అధ్యక్షులు వేల్పుల స్వామి యాదవ్, టి. నరేష్, ప్రమీల, జియావుద్దీన్, హన్మంతరావు, ఎద్దండి రమేష్ రెడ్డి, స్వర్ణలత, శ్రీలత, నీరజ, నాగలక్ష్మి, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button