ముఖ్యమంత్రి రైతు నేస్తం పై ప్రత్యేక దృష్టి 1034- రైతు వేదికల్లో నేడు ప్రారంభోత్సవం

viswatelangana.com
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని రైతు వేదిక లో ముఖ్యమంత్రి. రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర రైతు వేదికలకు వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానం ప్రారంభోత్సవ కార్యక్రమం. రైతులతో ముఖాముఖి కార్యక్రమం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1031 రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్ కేంద్రాల ద్వారా ప్రత్యక్ష ప్రసారం జరుపబడింది. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వానాకాలం 2025 – 26 పంటలకు రైతు భరోసా పథకం కింద రైతు పెట్టుబడి నిధులు విడుదల చేయడం జరిగింది. కోడిమ్యాల మండలంలోని తిర్మలాపూర్, కొడిమ్యాల, పూడూరు రైతు వేదిక లలో సోమవారం జరిగిన ఈ కార్యక్రమం లో మండల ప్రత్యేక అధికారి ఏ. చరణ్ దాస్.మండల వ్యవసాయ అధికారి పి. జ్యోతి,తిర్మలాపూర్ నోడల్ అధికారి. ఎంపీడీఓ స్వరూప, పూడూరు నోడల్ అధికారి. ఎంపీవో వెంకటేశ్వర్లు, టెక్నికల్. వ్యవసాయ అధికారులు దీప్తి,సింధు మరియు పాక్స్ చైర్మన్ లు పోలు రాజేందర్, బండ రవీందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గడ్డం జీవన్ రెడ్డి, మాజీ ప్రజా ప్రతినిధులు ఏఈఓ లు రాజేష్, ప్రశాంత్, శ్రీలత, మరియు అన్ని గ్రామాల రైతులు పాల్గొన్నారు.



