రాయికల్
పాఠశాలకు దాతల కృషి హిందీ పండిట్ ప్రోత్సాహం అభినందనీయం
viswatelangana.com
February 10th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం రామాజీపేట్ ఉన్నత పాఠశాల పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు సాయంత్రం ప్రత్యేక తరగతుల నిర్వహణ సందర్బంగా వారికి ఉత్తేజం అల్పాహారానికై ఇదే గ్రామానికి చెందిన ప్రస్తుతం జగిత్యాలలో వుంటున్న సామాజిక కార్యకర్త వ్యాపార వేత్త అయిలేని కృష్ణారెడ్డి విద్యార్థుల అల్పాహారానికై పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు గజ్జెల నరేందర్ ఆర్.యు.పి.పి.టి జగిత్యాల జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి వేల్పుల స్వామి యాదవ్ లకు 3 వేల రూపాయల నగదు విరాళం అందజేశారు ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ పాఠశాలకు దాతల గ్రామస్థుల సహకారం అభినందనీయమని దాత అయిలేని కృష్ణారెడ్డి ని దాతను ప్రోత్సహించిన పాఠశాల హిందీ పండిట్ వేల్పుల స్వామి యాదవ్ లను అభినందించారు



