అనుమానాస్పదంగా గొర్రెలు మృతి
viswatelangana.com
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం లోని ఆయోధ్య గ్రామంలో యాదవ కులస్తులకు చెందిన 20 గొర్రెలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాయి. గ్రామానికి చెందిన ఒర్రె గంగ మల్లయ్య, ఒర్రె రమేష్, ఓర్రె గంగ రాజం దినసరి వృత్తిలో బాగంగా గొర్రెలను, మేకలను మేపేందుకు గ్రామ శివారులో కి తీసుకెళ్ళి మేపు తుండగా, గొర్రెలు కొన్ని గంటల వ్యవధి లోనే అనుమానాస్పదంగా క్రింద పడి కొట్టుకొని మృతి చెంది నట్లు బాధిత గొర్రెల యజమానులు తెలిపారు. ఇట్టి సమస్యను స్థానిక నాయకుల సహాయం తో వైద్యాధికారి సమాచారం అందివ్వగా, వెంటనే మండల పశు వైద్యులు శ్రీనివాస్ స్పందించి గొర్రెలు మృతి చెందిన స్థలానికి చేరుకుని, పంచనామా నిర్వహించారు. గొర్రెలు క్రిమి సంహారక మందులు తిని మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఇట్టి క్రిమి సంహారక మందులు వన్య ప్రాణులను వేటాడేందుకు పెట్టిన మందులు గా స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేశారు. కాగ గ్రామానికి చెందిన ఓర్రే గంగ మల్లయ్య వి12 గొర్రెలు, మేకలు, ఓర్రే రమేష్ వి 4 గొర్రెలు, ఓర్రే గంగ రాజం వి 4గొర్రెలు మృతి చెందాయి. సుమారు 3లక్షలకు పైగా ఆర్థికంగా నష్టపోయామని బాధిత రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. బాధిత యాదవ పాడి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామ తాజా మాజీ సర్పంచ్ ఎడమల జీవన్ రెడ్డి, యాదవ సంఘం మండల అధ్యక్షుడు వాసరి రవి యాదవ్, ప్రధాన కార్యదర్శి లాల్చావుల రాజేష్ యాదవ్ కోరారు.



