మెట్ పల్లి
మెట్లచిట్టాపూర్ లో ఘనంగా సీతారాముల కళ్యాణ వేడుకలు

viswatelangana.com
April 17th, 2024
మెట్ పల్లి (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం మెట్ల చిట్టా పూర్ గ్రామంలో శ్రీ రామ నవమి వేడుకలు మంగళ వాయిద్యాలు, వేద ముంత్రోచ్చరణలు మధ్య అభిజిత్ లగ్నం లో మ: 12:00 గ: లకు సీతారాముల కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ శేఖర్ రెడ్డి, ఎంపీటీసీ సధిరం గంగాధర్, ఆలయ కమిటీ సభ్యులు, స్వాములు, పెద్ద మనుషులు గ్రామ ప్రజలు స్వామి వారిని దర్శించుకొని భోజన ప్రసాదాలు స్వీకరించారు.



