మెట్ పల్లి

మెట్ పల్లిలో అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రాణదాత కటుకం గణేష్ కు ఘన సన్మానం

viswatelangana.com

June 14th, 2025
మెట్ పల్లి (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలో అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా సామాజికవేత్త, రక్తదాన సంధానకర్త, ప్రాణదాత కటుకం గణేష్ ను ఆత్మీయంగా ఘన సన్మానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెట్ పల్లి ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ గంగాసాగర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ గంగాసాగర్ మాట్లాడుతూ గతకొన్ని సంవత్సరాల నుండి కోరుట్ల చుట్టుపక్కల గ్రామాలలో ఎవరికి అవసరం ఉన్న అత్యవసర సమయంలో రక్తాన్ని అందించడంలో ముందంజలో ఉన్న కటుకం గణేష్ ధన్యజీవి అని ఆయన అభినందించారు.కటుకం గణేష్ కోరుట్ల ప్రాంతానికే కాకుండా తెలంగాణ రాష్ట్రాన్నికే దిక్సూచిగా మారడం సంతోషదాయకమని ఆయన అభివర్ణించారు. కోరుట్ల పట్టణంలో 2007 సంవత్సరంలో రక్తదాన ఉద్యమం ప్రారంభించి, నేటికీ 18 సంవత్సరాలలో 4250 మంది రక్తదాతలతో రక్తాన్ని ఇప్పించిన కటుకం గణేష్ గొప్ప వ్యక్తి అని ఆయన కొనియాడారు. ఒకప్పుడు రక్తం దొరకక ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయని, ఇప్పుడు గత 18 సంవత్సరాల నుండి సామాజికవేత్త, రక్తదాన సంధానకర్త, ప్రాణదాత కటుకం గణేష్ రక్తదానం ఉద్యమాన్ని ప్రారంభించిన నుండి కోరుట్ల ప్రాంతంలోనే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలలో రక్తదానానికి కొదవ లేకుండా చూస్తున్న వ్యక్తి కటుకం గణేష్ అని ఆయన ప్రశంసించారు. ముందు భవిష్యత్తులో మరెంతో మందికి రక్తాన్ని అందించి, ప్రాణాలను కాపాడి ఇలాంటి మరెన్నో కార్యక్రమాలను చేపట్టి ఇంకా మునుముందు మెరుగైన సేవలు అందిస్తూ, మరికొంతమంది రక్తదాతలను తయారు చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో అమ్మ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు పుల్ల శ్రీనివాస్ గౌడ్, డాక్టర్ రవీందర్, స్వచ్ఛంద సంస్థల సభ్యులు, యువజన సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button