ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చెయ్యాలి – బడిబాట కార్యక్రమం లో ఎంఈవో ఆనందరావు

viswatelangana.com
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలోని మండల విద్యాధికారి ఆనందరావు ఆధ్వర్యంలో కథలాపూర్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు అర్జున్, అంబారిపేట కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు కిషన్ రావు లు గ్రామ గ్రామాన ప్రతి ఇంటికి తిరిగి విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. మండల విద్యాధికారి ఆనందరావు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య అందుతుందని విద్యతో పాటు, ఉచిత పుస్తకాలు, యూనిఫామ్, మధ్యాహ్న భోజనం, స్కాలర్షిప్ లు అందుతాయని అన్నారు. కథలాపూర్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు అర్జున్ మాట్లాడుతూ జిల్లాలోనే మొదటగా మండలంలో బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించామని అన్నారు. ఇట్టి బడి బాట కార్యక్రమం లో ప్రాథమిక విద్యార్థులు,హై స్కూల్ విద్యార్థులకు అడ్మిషన్లు జరుగుతున్నవని, అంతే కాకుండా అర్హత కలిగిన ఉపాధ్యాయులు ఉంటారని అన్నారు. అంబారిపేట కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు కిషన్ రావు మాట్లాడుతూ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థిని ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని ఇందుకు గ్రామస్తుల సహకారం ఎంతగానో అవసరం ఉన్నదని తెలిపారు. ఈ కార్యక్రమం లో ఉపాధ్యాయులు క్రిష్ణ రావు, ధరందీప్, పాటిల్, వెంకటేశం, ఏడుకొండలు, అశోక్, వెంకటేష్, వెంకటస్వామి, శశిధర్, నజీర్, శ్రీనివాస్ రెడ్డి, పరమేశ్వర్, విష్ణు, రాజశేఖర్, జగన్, వేణుగోపాల్, రవి, మహేందర్ రావు, లక్ష్మీ, రాజేష్, స్వప్న, భారతి, ధనలక్ష్మి, చంద్రమౌళి, సీఆర్పీలు రాజేందర్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.



