రాయికల్
మండల విద్యాధికారిని సన్మానించిన పిఆర్టియు టీఎస్ నాయకులు

viswatelangana.com
September 25th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ మండల విద్యాధికారిగా భాద్యతలు చేపట్టిన శ్రీపతి రాఘవులు ను పిఆర్టియు టిఎస్ నాయకులు బుధవారం సన్మానించారు. మండలంలో పాఠశాలల అభివృద్ధి, విద్య అభివృద్ధి కి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యకులు పొన్నం రమేష్, కుంబాల శ్రీనివాస్,జిల్లా అసోసియేట్ అధ్యక్షులు కన్నావేని మల్లారెడ్డి, జిల్లా కార్యదర్శి దొంతి సతీష్, మండల శాఖ అధ్యక్షులు అంతడుపుల గంగారాజం, రాపర్తి నర్సయ్య, లక్కడి రాజారెడ్డి, మాచర్ల మహేష్, సిలివేరి రమేష్, ఊసకోల రాము, చెటపెల్లి బాపురావు, గాజంగి రాజేశం, అక్కన పెల్లి సతీష్, గడికొప్పుల నరేష్, సురేందర్, ఎలిగేటి నరేష్, పిజి హెచ్ఎం సదాశివ్ తదితరులు పాల్గొన్నారు.



