కథలాపూర్
మోటార్ సైకిల్ మీద పడి వ్యక్తి మృతి

viswatelangana.com
August 25th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
కథలాపూర్ మండలం గంభీర్ పూర్ గ్రామానికి చెందిన గండి గంగాధర్ అనునతడు నిన్న సాయంత్రం 6:30 గంటల సమయంలో షాప్ కి వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదని ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ తీయకపోయేసరికి అతని గురించి వెతకగా మృతుడు గంభీర్ పూర్ గ్రామ శివారులో ఒక పొలం వద్ద ప్రమాదవశాత్తుగా మోటార్ సైకిల్ తనపైనే పడిపోయి ఉండి చాతిలో అయిన గాయాలతో అక్కడికక్కడే చనిపోయాడని మృతుడి భార్య గండి లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనైనదని కథలాపూర్ ఎస్సై తెలిపినారు.



